Mon Dec 23 2024 10:22:02 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. ఎంత వరకూ నిజం ?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 2019లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్. ఈ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్..
టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ లోకి.. బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం షరా మామూలైంది. హీరోల నుంచి విలన్ల వరకూ, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇండస్ట్రీలు మారుతూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో పలు క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ తో సినిమా తెరకెక్కనున్నట్లు బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీకి సమయం ఆసన్నమైందనేది ఆ వార్తల సారాంశం.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 2019లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్. ఈ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో.. ఇప్పుడు దానికి మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ వార్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ ని స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించబోతున్నారు. పఠాన్, టైగర్, వార్ సినిమాలతో స్పై సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ టైగర్ 3 కి కొనసాగింపుగా ఉంటుందని తెలియజేశారు. ఈ సినిమాలో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడని బి-టౌన్ మీడియా వార్తలు రాసుకొస్తుంది.
RRR సినిమాతో ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపుతోనే ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్ ఎంట్రీ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
Next Story