Mon Dec 23 2024 10:32:15 GMT+0000 (Coordinated Universal Time)
Devara: ఈరోజు సర్ ప్రైజ్ ఇవ్వనున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు న్యూఇయర్ రోజున ఊహించని గుడ్ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు న్యూఇయర్ రోజున ఊహించని గుడ్ న్యూస్. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'దేవర' సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నేడు అభిమానులకు ఇవ్వనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అదిరే అప్డేట్ ఇవ్వనున్నారు. దేవర సినిమా గ్లింప్స్ గురించి అప్డేట్ను నేడు మూవీ యూనిట్ వెల్లడించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో దేవర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఉదయం 11 గంటల 7 నిమిషాలకు గ్లింప్స్ డేట్పై అనౌన్స్మెంట్ రానుంది. దేవర కొత్త పోస్టర్తో గ్లింప్స్ అప్డేట్ను మేకర్స్ ఇవ్వనున్నారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా గ్లింప్స్ చాలా బాగుంటుందని ఇప్పటికే ట్వీట్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రతీర వాసుల కోసం పోరాడే యోధుడి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు ఎన్టీఆర్. 2024 ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, కలైయరాసన్ కీరోల్స్ చేస్తున్నారు.
Next Story