ప్రమోషన్స్ లేకపోవడమే.. కొంప ముంచిందా
ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతికొచ్చినప్పటినుండి.. క్రిష్ చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా [more]
ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతికొచ్చినప్పటినుండి.. క్రిష్ చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా [more]
ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతికొచ్చినప్పటినుండి.. క్రిష్ చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ.. సినిమా మీద భారీ అంచనాలు పెంచాడు. కథానాయకుడు ఆడియో సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, ప్రి రిలీజ్ ఈవెంట్ కానీ.. అన్ని కథానాయకుడు సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశాయి. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో వేసిన గెటప్స్ అన్ని ప్రేక్షకుల్లోకి డీప్ గా వెళ్లాయి. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎలా వుండబోతుందో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ తో ఆ సినిమా విడుదలకు అందరూ ఎదురు చూసేలా చేసింది. ఇక క్రిష్ కానీ, బాలకృష్ణ కానీ, ఆ సినిమాలో చిన్న చిన్న రోల్స్ లో నటించిన సెలబ్రిటీస్ కూడా కథానాయకుడు సినిమా విడుదలకు ముందు ఎంతగా ప్రమోషన్స్ చేసారో తెలిసిందే. అందులోను సంక్రాతి పండగ అవడంతో.. టివి ఛానల్స్ లోను బాలయ్య, క్రిష్ లు కథానాయకుడు ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు.
అయితే విడుదలయ్యాక కథానాయకుడు టాక్ తేడా కొట్టడంతో.. బాలకృష్ణ, క్రిష్ లు మహానాయకుడు షూటింగ్ వంకతో మీడియాకి కనబడకుండా తప్పించుకున్నారు. ఇక మహానాయకుడు సినిమా విడుదలవుతున్నాడని కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, బాలకృష్ణ కానీ క్రిష్ కానీ విద్య బాలన్ కానీ ఎలాంటి ఇంటర్వూస్ లేకపోవడంతో మహానాయకుడు థియేటర్స్ లోకి దిగినా.. ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. మహానాయకుడు సినిమా మీద బాలకృష్ణ, క్రిష్ లు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి కలిగించి ఉంటే ఫలితం ఇంత దారుణంగా ఉండేది కాదు. కథానాయకుడు దెబ్బకి బెంబేలెత్తిన బయ్యర్లే మహానాయకుడ్ని తీసుకున్నారు. మహానాయకుడు కనీస ప్రమోషన్స్ లేకపోవడంతో.. అసలు ఎలాంటి క్రేజ్ సినిమా మీద క్రియేట్ కాలేదు.. మరి కథానాయకుడు దెబ్బకి కోలుకొని బయ్యర్స్ ఇపుడు మహానాయకుడు తో మరింత కుంగిపోవడం ఖాయం.
మరి బాలకృష్ణ, క్రిష్ లు మహానాయకుడు సినిమా ప్రమోషన్స్ ని గాలికి వదిలెయ్యడం మూలంగానే మహానాయకుడు అంత దారుణమైన పరిస్థితుత్లో ఉందనేది నిజం. సినిమా విడుదలకు ముందు చెయ్యాల్సిన ప్రమోషన్స్.. సినిమా హిట్ అయితే చేద్దామనుకున్నారట వీరిద్దరూ. మహానాయకుడు సినిమా హిట్ టాక్ పడితే… అప్పుడు మహానాయకుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఓ రేంజ్ లో చేద్దామనుకున్నారట. మరి సినిమా విడుదలకు ముందు చప్పగా థియేటర్స్ లోకి వస్తే.. విడుదలయ్యాక హిట్ ఎలా అవ్వుద్దనుకున్నారో?