ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ కలగడం లేదు
మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం [more]
మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం [more]
మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలవుతుందని.. ఒక రోజంతా సినిమా పోస్టర్స్ తో హంగామా చేసిన మహానాయకుడు టీం… రెండో రోజు మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో పాటుగా సాయంత్రానికల్లా మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేసింది. కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియా మొత్తం ఎదురు చూడడమే కాదు.. నందమూరి ఫాన్స్ తెగ హడావిడి చేసింది. కానీ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది అంటే.. సోషల్ మీడియాలో ఎటువంటి హడావిడి లేదు.. అలాగే నందమూరి ఫాన్స్ హడావిడి కనబడినా అంతగా ఎక్కడా ఫోకస్ అవ్వలేదు.
ఇక కథానాయకుడు ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరు కథానాయకుడు విడుదల కోసం వైటింగ్ అన్నవారు.. మహానాయకుడు ట్రైలర్ చూసాక చాలా చప్పగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కథానాయకుడు లో బాలకృష్ణ, ఎన్టీఆర్ గా ఆకట్టుకుంటే.. మహానాయకుడిలో రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ లా బాలకృష్ణ అంతగా నప్పలేదంటున్నారు. ఇక మహానాయకుడు ట్రైలర్ మొత్తం రాజకీయాల చుట్టూతానే చూపించాడు. అయితే అక్కడక్కడా ఎమోషన్, బాధ లాంటివి కలిపాడు కానీ… ఎందుకో కథానాయకుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ మహానాయకుడు మీద కలగడం లేదు అనేది వాస్తవం. అలాగే మహానాయకుడు విడుదలకు కేవలం ఆరు రోజులే ఉన్నప్పటికీ… ఆ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ ఇసుమంత ఇంట్రెస్ట్ కలగడం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడమే మహానాయకుడుపై ఇంట్రెస్ట్ కలగక పోవడానికి మెయిన్ కారణం.
అసలే మహానాయకుడు ప్రమోషన్స్ వీక్ గా ఉండి.. సినిమా మీద ఆసక్తి పెరగడం లేదు అంటే.. ఇప్పుడు మహానాయకుడు ట్రైలర్ చూసాక కాస్తో కూస్తో ఉన్న ఆసక్తి సన్నగిల్లిందని… మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయాలతో ఎంతగా సతమత మయ్యాడో చూపించిన క్రిష్… చంద్రబాబు కేరెక్టర్ ని ఎలా మలిచాడో అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ని కల్గించే అంశం. అయితే చంద్రబాబు పాత్ర కన్నా ఎక్కువగా.. ఈ సినిమాలో నాదెళ్ల కేరెక్టర్ హైలెట్ అయ్యేలా కనబడుతుంది.. మహానాయకుడు ట్రైలర్ చూసాక. మరి సినిమాలో కావాల్సిన పాయింట్స్ మిస్ కాకపోతే సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. ఇక మహాకనాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లో కి వెళ్ళాలి. లేదంటే కేవలం ఐదు రోజుల్లోనే మహానాయకుడు మీద ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడం కష్టం. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే.. మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుంది.. లేదంటే కష్టం సుమీ…!