మరీ ఇంత చప్పగానా…. నాయకా?
ఈరోజు విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో అస్సలు ఇంట్రస్టే కనబడడం లేదు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు [more]
ఈరోజు విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో అస్సలు ఇంట్రస్టే కనబడడం లేదు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు [more]
ఈరోజు విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో అస్సలు ఇంట్రస్టే కనబడడం లేదు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తో పూర్ కలెక్షన్స్ తో ఉండడంతో… ఇప్పుడు విడుదలవబోతున్న మహానాయకుడు మీద అస్సలు ఆసక్తి కలగలేదు. అందులోనూ సెన్సార్ వారు ఏమన్నా అభ్యంతరాలు పెట్టినా… ఆ సినిమా లో కాస్త నెగెటివ్ షేడ్స్ లో ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు మీడియాలో కాస్త మహానాయకుడుపై ఫైర్ అయినా.. సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ దొరికేది. అలాగే లక్ష్మి పార్వతి కూడా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు విడుదలకు ముందు కాస్త అటు ఇటుగా తన పాత్ర ని నెగెటివ్ గా చూపిస్తే ఊరుకోనని మీడియాలో హల్చల్ చేసింది. కానీ మహానాయకుడు విడుదల టైం దగ్గరపడింది.. లక్ష్మి పార్వతి మాత్రం కామ్ గా ఉండిపోయింది. అందుకే మహానాయకుడు ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు.
అసలే ప్రమోషన్స్ లేవు.. అందులో ఫ్రీ పబ్లిసిటీ లేదు.. బాలకృష్ణ కూడా మీడియాకి కనబడడం లేదు. ఇక క్రిష్ మీడియాతో మట్లాడితే కథానాయకుడు, మణికర్ణికా గురించి మాట్లాడాలి కనుక ఆయన సైలెంట్. మరి నాదెండ్ల భాస్కర్ రావు ని ట్రైలర్ లో విలన్ గా చూపించిన…. నాదెండ్ల ఎక్కడ ఓపెన్ అవ్వకపోయేసరికి క్రిష్ – బాలయ్య ఎత్తుగడ ఫలించలేదని చెప్పాలి. నాదెండ్ల భాస్కర్ రావు మహానాయకుడిలో తన పాత్రపై స్పందిస్తే.. మహానాయకుడు మీద ఎక్కడో అక్కడ కాస్త ఇంట్రెస్ట్ కలిగేది. లేదా లక్ష్మి అపార్వతి అయినా… తన మీద మహానాయకుడిలో ఏం చూపించారో దాన్ని ఖండిస్తున్నాని చెప్పినా బావుండేది. అంతగా సెన్సార్ వారైనా మహానాయకుడి విషయంలో ఆసక్తి కలిగించే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినా బావుండేది. మరి మహానాయకుడుకి క్లీన్ యు వచ్చేసరికి అందులో ఎలాంటి విషయం లేదని జనాలకు అర్ధమవడం, మహానాయకుడు ట్రైలర్ చూసాక కూడా మహానాయకుడు మీద ఆసక్తి చచ్చిపోవడంతోనే.. ఈ రోజు ఎంతో హంగామా కనబడాల్సిన థియేటర్స్ ఎలాంటి హంగామా లేకుండానే మరీ చప్పగా వచ్చేసింది మహానాయకుడు సినిమా