ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ వస్తున్నాడు.. ఇది ఫిక్స్..!
మొన్నటివరకు బాలయ్య - ఎన్టీఆర్ అంటీముట్టనట్టు ఉండేవారు. కానీ హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కటయ్యారు. హరికృష్ణ మరణం మృతి చెందినప్పుడు బాలయ్య దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. 'అరవింద సమేత' సక్సెస్ ఫంక్షన్ అప్పుడు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చి ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడాడు. ఈ నేపధ్యంలో కొన్ని రోజుల నుండి 'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ వస్తాడా..? లేదా..? అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ అక్క కుకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ప్రచారానికి దూరంగా ఉన్నాడు. దాన్నిబట్టి ఇంకా కుటుంబంలోని విబేధాలు పూర్తిగా సద్దుమణగలేదని అర్థమవుతోంది.
త్వరలోనే అంతా ఒకే స్టేజ్ పై...
అయితే రీసెంట్ గా కుకట్పల్లి నియోజికవర్గంలో సుహాసినిని సపోర్ట్ చేస్తూ బాలయ్య ఇంటిఇంటి ప్రచారం, రోడ్ షో చేస్తున్న టైంలో..."సుహాసిని ప్రచారానికి ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడిపుడే సినిమా పరిశ్రమలో అంచెలు అంచెలుగా ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే కొంతమందికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మరోపక్క ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసి రాదు. అందుకే ఎన్టీఆర్ ను ప్రచారం రావద్దని నేనే చెప్పా" అని బాలయ్య అన్నాడు. ఇదంతా చూస్తుంటే 'ఎన్టీఆర్' బయోపిక్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ కచ్చితంగా వస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ వచ్చాడంటే ఆటోమేటిక్ గా తన అన్న కళ్యాణ్ రామ్ కూడా వచ్చేస్తాడు. పైగా కళ్యాణ్ రామ్ ఇందులో హరికృష్ణ పాత్రలో నటించాడు. అంటే, మరోసారి నందమూరి ఫామిలీ మొత్తాన్ని ఒకే స్టేజ్ మీద చూసే అవకాశం దగ్గరలోనే ఉంది.