బాబాయ్ కి అబ్బాయ్ పార్టీ.. మరి ఏం జరిగిందో..?
గత వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణ మీద వార్తలు ఇంటర్నెట్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయి. గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణలు హరికృష్ణ మరణంతో ఒకటయ్యారు. అయితే ఎంతగా ఒక్కటిగా అనిపించినా నందమూరి అభిమానుల్లో ఎదో వెలితి. బాబాయ్ అబ్బాయ్ ల మధ్య ఇంకొంత గ్యాప్ ఉందనేలా అరవింద సమేత సక్సెస్ మీట్ వేదికగా అనిపించింది. ఏదో... బాలకృష్ణ.. కళ్యాణ్ రామ్ అడగగా వచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ గురించి మట్లాడకపోవడం.. ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలయ్య గురించి పొడిపొడిగా మట్లాడడంతో అభిమానులతో పాటు అందరూ వారి మధ్య గ్యాప్ అట్లానే ఉందంటూ కామెంట్స్ చేశారు.
రాత్రంతా పార్టీలోనే...
అయితే అదే రోజు రాత్రి జరిగిన పార్టీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఎంజాయ్ చేసిన విషయం తాజాగా బయటికొచ్చింది. అరవింద సమేత సక్సెస్ మీట్ జరిగిన రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో బాబాయ్ కి పార్టీ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎన్టీఆర్ ఇచ్చిన స్పెషల్ పార్టీలో బాలకృష్ణ బాగా ఎంజాయ్ చేసాడని.. అసలు రాత్రంతా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నాడనే విషయం తెలిసినప్పటి నుండి నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అరవింద ఈవెంట్ లో లైట్ గా ఉన్న బాబాయ్ అబ్బాయ్ లు పార్టీలో మనసు విప్పి మట్లాడుకున్నారా..?
ఎన్నికల ప్రచారానికి ప్రయత్నం..?
అసలింతకీ గంటల తరబడి బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య అంత ఆసక్తికరంగా చర్చ జరిగిన విషయం ఏమిటో గానీ ప్రస్తుతం బాలయ్య - ఎన్టీఆర్ ల పార్టీ విషయాలు మీడియాలో రకరకాల గాసిప్స్ తో చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ తో సినిమాల గురించి, కుటుంబం గురించి అలాగే రాబోయే ఎన్నికల గురించి మట్లాడుంటాడని.. బాబాయ్ తో కలవడం కోసమే వేచి చూస్తున్న ఎన్టీఆర్ ఇవన్నీ శ్రద్దగా విన్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మరి ఎన్టీఆర్ ని 2019 ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ పార్టీతో మొదలైందని టాక్ మాత్రం రేజ్ అయ్యింది. మరి నిజంగా ఆ పార్టీలో ఏం జరిగిందో తెలియదు గాని.. ఆ పార్టీ జరిగినందుకు నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.