Mon Dec 23 2024 01:56:38 GMT+0000 (Coordinated Universal Time)
NTR31 అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. 2024 సమ్మర్..
ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే NTR31 అప్డేట్ ని ఇచ్చిన మేకర్స్.
మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్.. RRR తరువాత తన తదుపరి సినిమాని ప్రారభించడానికి చాలా గ్యాప్నే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మేకింగ్ విషయంలో ఫుల్ స్పీడ్ మెయిన్టైన్ చేస్తున్నాడు. కొరటాలతో తెరకెక్కిస్తున్న 'దేవర'ని షెడ్యూల్ తరువాత షెడ్యూల్ ని పూర్తి చేస్తూ ఫుల్ స్వింగ్ లో ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఒక పక్క ఈ మూవీ షూటింగ్ ని చేస్తూనే.. మరోపక్క తన తదుపరి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ ని కూడా చూస్తున్నాడు.
ఈక్రమంలోనే 'వార్ 2' మేకర్స్, NTR31 మేకర్స్ తో కాంటాక్ట్ లో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలే వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిశాడట. అయితే ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే NTR31. ఈ సినిమా కథ తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ నీల్ చెప్పుకురావడంతో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాయి. తాజాగా ఈ మూవీని ఎప్పుడు పట్టాలు ఎక్కించబోతున్నారని అనేది అభిమానులకు తెలియజేశారు. 2024 సమ్మర్ (ఏప్రిల్) నుంచి ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ నేడు తెలియజేశారు. భారతీయ చలన చిత్రసీమలో ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ నిలవబోతుంది అంటూ పేర్కొన్నారు.
ఇక నిన్న 'దేవర' సినిమాని రెండు బాగులుగా తీసుకు రాబోతున్నామంటూ ప్రకటించడం, నేడు ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్ ఇవ్వడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా దేవర మూవీ పనులు వచ్చే ఏడాది సమ్మర్ వరకు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీ కంప్లీట్ అవ్వడంతోనే NTR31 స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ 1&2 సినిమాలు కూడా సమ్మర్ కి పూర్తి కానున్నాయి.
Next Story