Thu Jan 09 2025 18:08:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ నుంచి ‘రాజర్షి’ 12న..!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం యన్.టి.ఆర్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన కథానాయకా టైటిల్ సాంగ్ కి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండో పాట రాజర్షిని డిసెంబర్ 12 ఉదయం 10.31 నిమిషాలకు విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మిగిలిన పాటలు కూడా డిసెంబర్ లోనే విడుదల కానున్నాయి. ఇందులో రానా, రకుల్, విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, సుమంత్, నిత్యామీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎన్ బి కే ఫిల్మ్స్, వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా పతాకాలపై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి యన్.టి.ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Next Story