Mon Dec 23 2024 11:53:55 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీకి ఎన్టీఆర్ అలా.. రామ్ చరణ్ ఇలా.. అభిమానుల గోల..
అల్లు అర్జున్ అవార్డు అందుకోవడంపై ఎన్టీఆర్ అలా, రామ్ చరణ్ ఇలా విషెష్ తెలియజేయడం మెగాభిమానులను కొంచెం ఇబ్బంది పెడుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమకు మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తీసుకు వచ్చాడు. 69 ఏళ్ళ నుంచి ఆ అవార్డు కోసం తెలుగు పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. అలాంటి పురస్కారాన్ని బన్నీ అందుకోవడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు నుంచి టాలీవుడ్ లోని ఇతర హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈక్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బన్నీ కూడా వాటికి రెస్పాండ్ అవుతూ రీ ట్వీట్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్.. "కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ బావ. పుష్పలో నటనకు గాను ఈ అవార్డుకు నువ్వు అర్హుడివి" అంటూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఇక దీనికి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. "హృదయపూర్వకంగా నువ్వు చెప్పిన శుభాకాంక్షలు నా గుండెను తాకాయి బావ" అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. నేషనల్ అవార్డు అందుకున్న అందరి విన్నర్స్ తో కలిపి అల్లు అర్జున్ కి కూడా సింపుల్ గా ఒక ట్వీట్ లో విషెస్ చెప్పేశాడు. ఇక దీనికి అల్లు అర్జున్ కూడా సింపుల్ గా జస్ట్ 'థాంక్యూ' అని రిప్లై ఇచ్చాడు. అసలే కొన్ని రోజులు నుంచి అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బన్నీకి ఎన్టీఆర్ అలా, రామ్ చరణ్ ఇలా విషెష్ తెలియజేయడం. అల్లు అర్జున్ వాటికీ తగ్గట్టు రిప్లై ఇవ్వడం మెగాభిమానులను ఇబ్బంది పెడుతుంది. అసలేమి జరుగుతుంది అంటూ ట్వీట్స్ వేస్తూ తమ బాధని తెలియజేస్తున్నారు.
అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇటీవల బేబీ సక్సెస్ ఈవెంట్ లో బన్నీ, భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ఇప్పటికి, ఎప్పటికి చిరంజీవి అభిమానులమే" అంటూ తెలియజేశారు. అంతకుముందు వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చిరంజీవి మాట్లాడుతూ.. "ప్రతి పండక్కి వాళ్లంతా కలిసి ఎంజాయ్ చేస్తారని, ఇంకెన్ని సార్లు వారి మధ్య ఉన్న ప్రేమ నిరూపించుకోవాలని" అంటూ ప్రశ్నిస్తూ గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అభిమానులు నమ్మకుండా ఉండడం బెటర్ అంటున్నారు సన్నిహితులు.
Next Story