అవసరమైతే అన్న బ్యానర్ వాడతాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ లాగ నిర్మాతగా మారబోతున్నాడనే న్యూస్ గత వారం రోజులుగా భీభత్సంగా చక్కర్లు కొట్టింది. బాబాయ్ బాలకృష్ణ కొత్తగా ఎన్ [more]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ లాగ నిర్మాతగా మారబోతున్నాడనే న్యూస్ గత వారం రోజులుగా భీభత్సంగా చక్కర్లు కొట్టింది. బాబాయ్ బాలకృష్ణ కొత్తగా ఎన్ [more]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ లాగ నిర్మాతగా మారబోతున్నాడనే న్యూస్ గత వారం రోజులుగా భీభత్సంగా చక్కర్లు కొట్టింది. బాబాయ్ బాలకృష్ణ కొత్తగా ఎన్ జికె బ్యానర్ పెట్టినట్లుగా ఎన్టీఆర్ కూడా కొత్త బ్యానర్ స్థాపించబోతున్నాడు అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. రాజమౌళి #RRR లో నటిస్తూ ఎన్టీఆర్ త్వరలోనే కొత్త నిర్మాణ సంస్థ మొదలెట్టబోతున్నాడని అంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నిర్మాతగా మారి రిస్క్ చేసే మూడ్ లో లేడని… ఎన్టీఆర్ ఎప్పుడు రిస్క్ చెయ్యడని.. ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతూ… రిస్క్ లేని వ్యాపారాల మీద ఇన్వెస్ట్ చేస్తాడట.
ఇక ఎన్టీఆర్ నిర్మాణ సంస్థ పెట్టడం ఎందుకు ఆయన అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉందిగా అంటున్నారు. ఇప్పుడు మహేష్, అల్లు అర్జున్ లాగ సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి ఎన్టీఆర్ రెడీ అయితే అది తన అన్న బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారానే తీసుకుంటాడు కానీ కొత్త బ్యానర్ పెట్టే ఆలోచన చెయ్యడని చెబుతున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ కొత్త బ్యానర్ పెడతాడా? అన్న బ్యానర్ వాడుకుంటాడా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్