ఎన్టీఆర్ ట్రైలర్ అందుకే అంత లెంగ్త్
'బాహుబలి' తరువాత రెండు రాష్ట్రాల తెలుగు వారు ఎదురు చూస్తున్న సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్. ఎన్టీఆర్ గురించి ఏమి చూపిస్తారు?అసలు ఎన్టీఆర్ అంటే ఎవరు? ఆయనకు ఇంత మంది ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నలన్నిటి 'ఎన్టీఆర్' మూవీ లో సమాధానం దొరకనుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఈసినిమాపై అంచనాలు ఎక్కడ తగ్గకుండా పెరుగుతూనే వచ్చాయి. రీసెంట్ గా ఈసినిమా యొక్క ట్రైలర్ మరింత అంచనాలని పెంచేసింది.
క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ట్రైలర్ చాలా గ్రాండియర్ గా ఉంది. విజువల్స్ కానీ..బాలకృష్ణ ఎన్టీఆర్ గెట్ అప్ లో కనపడే గెట్ అప్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్ నిడివి ఏకంగా 3 నిమిషాల 16 సెకన్లుండటం విశేషం. తెలుగు లో ఇప్పటివరకు ఇంత నిడివి ఉన్న ట్రైలర్స్ రాలేదు. సాధారణంగా బాలీవుడ్ వారు మూడు నిమిషాల ట్రైలర్లు వదులుతుంటారు. కానీ తెలుగు లో 3 నిమిషాల పై నిడివి ట్రైలర్ రావడం ఇదే మొదటిసారి. అయితే ట్రైలర్ ఇంత పెద్దగా ఉండటానికి కారణం ఇదే.....
'ఎన్టీఆర్' బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ...‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ గా రెండు భాగాలుగా ఈసినిమా రాబోతుంది. సో ట్రైలర్ లో కూడా రెండు భాగాల సంబంధించి కట్ చేసారు. అందుకే ట్రైలర్ నిడివి అంత వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ కోసం ప్రత్యేకంగా ఇంకో ట్రైలర్ వదిలే అవకాశం లేనట్లే. జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ...ఫిబ్రవరి 7 న 'యన్.టి.ఆర్-మహానాయకుడు’ రిలీజ్ అవుతున్నాయి అని అధికారంగా ప్రకటించారు.