Mon Dec 23 2024 11:03:00 GMT+0000 (Coordinated Universal Time)
Devara : 'దేవర' మూవీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..
గోవా షూటింగ్ జరుపుకుంటున్న 'దేవర' మూవీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్ అయ్యింది.
Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'దేవర'. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ ని వాయిదా వేశారు. ప్రస్తుతం మూవీ టీం షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సముద్రం ఒడ్డున ఒక సాంగ్, కొన్ని ముఖ్యమైన సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఆ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సముద్రం ఒడ్డున లుంగీ ధరించి ఉన్న ఎన్టీఆర్ ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఈ వీడియోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పుడు లీకైన వీడియోలో ఉన్నదీ ఫాదర్ క్యారెక్టర్ అని తెలుస్తుంది.
లుంగీ ధరించి ఉన్న పాత్ర తండ్రిదని, ప్యాంటు ధరించి ఉన్న పాత్ర కొడుకుదని సమాచారం. కాగా అభిమానులంతా ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాని ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ అయితే చేసారు గాని, కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. దసరా టైములో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Next Story