Sat Nov 23 2024 01:58:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ శత జయంతి: #NBK107 పోస్టర్ విడుదల
ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. నందమూరి తారక రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో..
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ 107వ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. ' క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఇవాళ #NBK107 పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. నందమూరి తారక రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శత జయంతి వేడుకల్లో భాగంగా బాలకృష్ణ నేతృత్వంలోనే ఎన్టీఆర్ జిల్లా నిమ్మకూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలన్నారు. ఎన్టీయార్ జన్మభూమి నిమ్మకూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఆయనకే అంకితమిస్తున్నామన్నారు.
నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.
Next Story