Mon Dec 23 2024 07:49:48 GMT+0000 (Coordinated Universal Time)
వాలెంటైన్స్ డే స్పెషల్ : మళ్లీ వస్తోన్న ఆ రొమాంటిక్ ఎంటర్టైనర్
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషకు అన్నయ్యగా రియల్ స్టార్ శ్రీహరి నటించాడు.
టాలీవుడ్ లో ఇటీవల రీ-రిలీజ్ ల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే వరుసగా రీ రిలీజ్ లు అవుతూ.. కోట్లలో కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఆడియన్స్ కూడా తమ అభిమాన హీరోల పాత చిత్రాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో.. ఊహించిన దానికన్నా రెట్టింపు రెస్పాన్స్ వస్తోంది. జల్సా, పోకిరి, ఒక్కడు తదితర బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ లు అయిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మరో బ్లాక్బస్టర్ మూవీ రీ-రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని, ఫిబ్రవరి 14న సిద్ధార్థ్-త్రిషల రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..!’’ రీ-రిలీజ్ కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషకు అన్నయ్యగా రియల్ స్టార్ శ్రీహరి నటించాడు. 2005లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తోందంటే.. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది.
Next Story