'నువ్వు తోపురా' టీజర్‌ని విడుదల చేసిన విజయ్ దేవరకొండ
సుధాకర్ కోమాకుల హీరోగా నిత్యా శెట్టి హీరోయిన్ గా బేబీ జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలిమ్స ,,యస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్లు పై హరినాథ్ బాబు బి.దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం "నువ్వు తోపురా".ప్రముఖ హీరోయిన్ నిరోషా ముఖ్య పాత్రలో నటిస్తోంది. నెస్ససీటీ ఈజ్ మదర్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.30 పర్సెంట్ ఇండియాలో ...70 పర్సెంట్ అమెరికాలో సుమారు 90 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి తెలుగు మరియు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు.అత్యధిక నిర్మాణ విలువలతో అమెరికాలోని అందమైన ప్రదేశాలలో ఒకటైన యుటలోని సాల్ట్ లేక్ సిటీ,బొనేవిల్ సాల్ట్ ప్లాట్స్, మోయాబ్ వంటి లోకేషన్స్ లో పూర్తిస్థాయిలో ఈ చిత్రం షూటింగ్ ని చిత్రీకరించారు.అక్కడ ఫస్ట్ టైం షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.పద్మశ్రీ తోట తరని వర్క్ ,విజయ్ యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్స్ కానున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జులై 14న హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో గనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి అర్జునరెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరై "నువ్వు తోపురా" టీజర్ ని లాంచ్ చేశారు.
ట్రెండింగ్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "- నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కి ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు సుధాకర్ నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు బాగా సపోర్ట్ చేసాడు.అతను చేసిన ఫోటో షూట్ స్టిల్స్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాకి ఛాన్స్ రావడానికి కారణం. ఈ మూవీ లైన్ విన్నప్పుడే పెద్ద హిట్ అనే ఫీలింగ్ కలిగింది.ట్రైలర్ ఎక్సలెంటు గా ఉంది.టికెట్స్ కొని మా ఫామిలీ తో ఈ సినిమా చూస్తాను.డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అయి సుధాకర్ కి మంచి పేరు తేవాలి.యూనిట్ అందరికి అల్ ఠె బెస్ట్ అన్నారు.
హీరో సుధాకర్ మాట్లాడుతూ.."- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి..కొన్ని కారణాల వల్ల చేయలేదు.6 ఏళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది.ఎలాగైనా ఒక మంచి హిట్ సినిమా చెయ్యాలి అని టీం అంతా కలిసి కష్టపడి ఈ సినిమా చేసాం.హరనాథ్ గారు చాలా అద్భుతంగా సినిమా తీసాడు. శ్రీకాంత్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.నిరోషా గారు 12 ఏళ్ళ తర్వాత తెలుగులో నటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాగరాజు క్యరెక్టర్ విత్తు అయితే ఈ చిత్రం లో సూరి క్యరెక్టర్ పెద్ద మొక్క.ఒక కుర్రాడు యూ యస్ వెళ్లి తన లైఫ్ లో ఎలా ఏది గాడు అనేది మెయిన్ స్టోరీ.ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రం ఉంటుంది.అన్నారు.
దర్శకుడు బి.హారనాధ్ బాబు మాట్లాడుతూ"- కృష్ణవంశీ, వై.వి.యస్.చౌదరి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో,ఈటీవీ లో వర్క్ చేసాను.రాసిపెట్టి ఉంటే అది కచ్చితంగా జరుగుతుంది.అలాగే ఈ సినిమాకి అన్ని కుదిరాయి. ఫస్ట్ సినిమా యు.ఎస్. లో షూటింగ్ జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు.శ్రీకాంత్ గారు ఎక్కడ కాంప్రమైజే కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.అందరికి ఈ మూవీ నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం.అన్నారు.
నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ"- ఒక టీం ల పామ్ అయి ఈ చిత్రానికి వర్క్ చేసిన కాస్ట్ అండ్ కృ అందరికి థాంక్స్. ప్రతి మనిషి జీవితంలో జరిగిన స్టోరీ ఇది.సినిమా చూసి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుంది అన్నారు.
ప్రముఖ హీరోయిన్ నిరోషా మాట్లాడుతూ"- 12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రం లో నటిస్తున్నాను.పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలింగింది. హరనాధ్,సుధాకర్ వచ్చి స్టోరీ చెప్పారు.నాకు బాగా నచ్చింది.డెఫినెటీగా ఇది నాకు కమ్ బాక్ ఫిల్మ్ అవుతుంది.కొత్త ప్రొడ్యూసర్ అయిన కూడా శ్రీకాంత్ ఎక్స్ పీరియెన్స్ ఉన్న ప్రొడ్యూసర్ ల పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.అన్నారు