Mon Dec 23 2024 06:55:38 GMT+0000 (Coordinated Universal Time)
Bimbisara OTT : ఓటీటీలోకి బింబిసారుడి ఆగమనం ఎప్పుడంటే..
టైం ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ప్రయోగాత్మాక సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా బింబిసార. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ.. కలెక్షన్ల వర్షం కురిపించింది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే బింబిసార.. ది బెస్ట్ గా నిలిచింది. టైం ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ప్రయోగాత్మాక సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. థియేటర్లలో ఈ సినిమాని చూసిన ఆడియన్స్ తో పాటు.. సినీ ప్రియులంతా ఈ సినిమాను ఓటీటీలో ఇంట్లోనే చూసేందుకు ఎదురుచూస్తున్నారు.
నెలరోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బింబిసార రిలీజ్ అయిన 50 రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనె వెల్లడించింది. 75 రోజుల తర్వాత బింబిసార ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బింబిసార స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది జీ5. ఈ నెల 21వ తేదీ నుంచి బింబిసార జీ5లో స్ట్రీమింగ్ కానుంది. బింబిసారుడి ఆగమనాన్ని థియేటర్లో మిస్సైన వారంతా ఇక ఓటీటీలో చూసేయచ్చు.
Next Story