Mon Dec 23 2024 14:48:17 GMT+0000 (Coordinated Universal Time)
Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్‌ని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడొదంటూ కామెంట్స్..
అమితాబ్ బచ్చన్ ని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడొదంటూ నెటిజెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి..?
ప్రస్తుతం దేశం మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం సెమీస్ లో న్యూజిలాండ్ తో పోరాడి ఓడిపోయి వెనుదిరిగిన ఇండియా.. ఈసారి వారి పైనే సెమీస్ గెలిచి ఫైనల్ కి చేరుకుంది. ఈ ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు ప్రధాని మోడీ కూడా హాజరుకాబోతున్నారట. అలాగే దేశంలోని పలువురు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడొదంటూ నెటిజెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వారు అలా రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి..? అసలు విషయం ఏంటంటే.. సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన తరువాత అమితాబ్ ఒక ట్వీట్ చేశారు. "నేను ఎప్పుడు మ్యాచ్ చూడకపోతే అప్పుడు మ్యాచ్ గెలుస్తుంది" అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పై నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. "ఫైనల్ మ్యాచ్ ని కూడా చూడకండి సార్. ఆరోజు ఏదో పనిలో బిజీగా ఉండడానికి ట్రై చేయండి" అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.
దీంతో ప్రస్తుతం అమితాబ్ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా వన్డే ప్రపంచకప్ మొదలవ్వడానికి ముంచు బీసీసీఐ.. అమితాబ్ కి గోల్డెన్ టికెట్ అందజేసింది. ఈ టికెట్ ఉపయోగించుకొని వరల్డ్ కప్ మ్యాచ్స్ ని ప్రత్యక్షంగా వీఐపీ బాక్స్‌లో కూర్చోని చూడొచ్చు. అమితాబ్ తో పాటు సచిన్ టెండూల్కర్, రజినీకాంత్ వంటి స్టార్స్ కి కూడా ఈ టికెట్ ని అందజేశారు. ఆ టిక్కెట్టుని ఉపయోగించుకొనే సెమీ ఫైనల్ మ్యాచ్ ని సచిన్, రజిని ప్రత్యేక్షంగా వీక్షించారు.
మరి అమితాబ్ తన సెంటిమెంట్ ని నమ్మి ఈ మ్యాచ్ ని చూడకుండా ఉంటారా..? లేదా ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ దగ్గర ఉండి వీక్షిస్తారా..? అనేది చూడాలి. కాగా 2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పుడు ఆస్ట్రేలియా ట్రోఫీని సాధించింది. ఈ సెమీస్ లో న్యూజిలాండ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన భారత్.. ఆస్ట్రేలియాకి కూడా ఇస్తుందా..? లేదా..? చూడాలి.
Next Story