Tue Dec 24 2024 01:55:38 GMT+0000 (Coordinated Universal Time)
IT's OFFICIAL : రేపే వరుణ్-లావణ్య ల ఎంగేజ్ మెంట్
ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం రేపే (జూన్ 9) వరుణ్-లావణ్య ల ఎంగేజ్ మెంట్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ కార్డ్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని కొద్దిరోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై అటు లావణ్య గానీ.. ఇటు మెగా కుటుంబ సభ్యులు గానీ పెదవి విప్పలేదు. దీంతో అసలు ఇది నిజమేనా ? అన్న సందేహం అందరికీ కలిగింది. అనుమానాలు, సందేహాలకు తెరదింపుతూ.. తాజాగా వరుణ్-లావణ్య ల ఎంగేజ్ మెంట్ ఇన్విటేషన్ కార్డును వరుణ్ తేజ్ టీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ప్రేమపక్షులపై రూమర్లకు ఎండ్ కార్డ్ పడింది.
ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం రేపే (జూన్ 9) వరుణ్-లావణ్య ల ఎంగేజ్ మెంట్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడుకకు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరు కానున్నారట. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్- లావణ్యలు నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి కానీ.. ఒక జంటను కలిపాయి.
అంతరిక్షం సినిమా నుంచి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని గతంలోనూ వార్తలొచ్చాయి. ఏడాదికాలంగా వరుణ్ - లావణ్య పెళ్లిపై వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరిద్దరి పెళ్లే హాట్ టాపిక్. అయితే నెటిజన్లు మాత్రం వీరికి కంగ్రాట్స్ చెబుతూనే.. సామ్-చైతన్య లాగా విడిపోకండి అంటూ సలహాలు కూడా ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమాలో సాక్షి వరుణ్ కి జోడీగా నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Next Story