Mon Dec 23 2024 07:57:39 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి ఒకే ఒక జీవితం..
ప్రేక్షకుల నుంచి ప్రశంసలందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా
శర్వానంద్, రీతూవర్మ ప్రధానపాత్రల్లో, అమల ముఖ్యపాత్రలో దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించిన తాజా సినిమా ఒకేఒక జీవితం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అక్కినేని అమల, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి జేమ్స్ బెజోయ్ సంగీతం అందించారు. బ్రహ్మాస్త్ర వంటి.. భారీ సినిమాతో పోటీపడిన ఈ సినిమా.. మంచి విజయాన్ని అందుకుని, మంచి వసూళ్లు రాబట్టింది.
ప్రేక్షకుల నుంచి ప్రశంసలందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒకే ఒక జీవితం.. ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని దీపావళీ కానుకగా అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. "జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన "ఒకే ఒక జీవితం" ఈ నెల 20 నుండి మీ సోనీ LIV లో" అని ట్వీట్ చేసింది.
Next Story