Fri Nov 22 2024 19:56:15 GMT+0000 (Coordinated Universal Time)
Murali Mohan : యాభై ఏళ్ల జయ"భేరి".. మురళీమోహన్ సన్మాన సభలో చంద్రబాబు
మురళీ మోహన్ సినీ రంగ ప్రవేశం చేసి యాభై ఏళ్లయిన సందర్బంగా శిల్పకళావేదికలో భారీ కార్యక్రమం జరిగింది
మురళీ మోహన్ సినీ రంగ ప్రవేశం చేసి యాభై ఏళ్లయిన సందర్బంగా శిల్పకళావేదికలో భారీ కార్యక్రమం జరిగింది. మురళీ మోహన్ అభిమానులు పెద్దయెత్తున హాజరై ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డు అని, అది కొందరికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆయన కేవలం సినీరంగంలోనే కాకుండా, వ్యాపార, రాజకీయ రంగంలోనో సక్సెస్ అయ్యరన్నారు. తెలుగు నేల గౌరవం - తెలుగు సినీ గాండీవం అనే పాటను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మురళీ మోహన్ మొత్తం 350 సిినిమాల్లో నటించారని, రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడ ప్రజలకు సేవలందించారని కొనియాడారు.
సినీ రంగంలోనే కాదు....
మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా 20 సినిమాలు నిర్మించారని, తాను హైటెక్ సిటీ కడితే..దాని పక్కన జయభేరి ఎస్టేట్స్ తో బ్రహ్మాండంగా నిర్మాణాలు చేశారన్నాు. 36 ఏళ్ల నుండి నిరంతరాయంగా అయ్యప్ప దీక్ష చేపట్టడం గర్వకారణమన్న చంద్రబాబు మురళీమోహన్ ఒక అలుపెరగని వీరుడుడని అన్నారు.. 11 వందల మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసి వారి జీవితాలు మార్చారని, 1978లో తాను, వెంకయ్యనాయుడు రాజకీయాల్లోకి వచ్చామని, అప్పట్లో వెంకయ్య నాయుడును చూస్తే అసెంబ్లీ గడగడలాడేదని, 1984లో ఎన్టీఆర్ ను సీఎంగా తొలగిస్తే వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నా ఎన్టీఆర్ కు అండగా ఉండి సీఎం అయ్యేదాకా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.
పదవులకే వన్నె తెచ్చిన...
తీసుకున్న పదవులకే వన్నెతెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని అన్నారు.. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు రావడం తెలుగుజాతికే గర్వకారణమన్న చంద్రబాబు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా దేశానికి విశేషమైన సేవలందించారని తెలిపారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా నేటికీ బ్రహ్మాండంగా సేవలందిస్తున్నారని, గతంలో ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండేవని, అయినా ఇక్కడ హైటెక్ సిటీ నిర్మించాననని తెలిపారు. దేశంలోని నిష్ణాతులందరినీ పిలిచి వారి సూచనలు, సలహాలతో హైటెక్ సిటీ నిర్మించామని, భవనాలు అన్నీ పూర్తయ్యాక హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం ఎలా ఉందో తెలియడానికి రాక్ గార్డెన్ పెట్టమన్నారు..
Next Story