Mon Dec 23 2024 19:17:34 GMT+0000 (Coordinated Universal Time)
"శభాష్ మీథూ".. హ్యాపీ బర్త్ డే మిథాలీ రాజ్
మిథాలీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా శభాష్ మీథూ. ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఉమెన్ క్రికెట్ ప్రపంచ రాణి.. ఉమెన్ క్రికెట్ టీమ్ టెస్ట్స్, వన్ డే మ్యాచ్ ల కెప్టెన్ అయిన మిథాలీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా శభాష్ మీథూ. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ఈ సినిమాలో మిథాలీ రాజ్ పాత్ర పోషిస్తోంది.
బర్త్ డే సందర్భంగా...
శుక్రవారం మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు తాప్సీ. 2022, ఫిబ్రవరి 4వ తేదీన "శభాష్ మీథూ" విడుదల చేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే మిథాలీ రాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మిథాలీరాజు విషయానికొస్తే.. ఉమెన్ క్రికెట్ టీమ్ లో రాణించడమే కాకుండా.. పద్మశ్రీ, అర్జున, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.
- Tags
- mithali raj
- tapsi
Next Story