Mon Dec 23 2024 07:36:52 GMT+0000 (Coordinated Universal Time)
టబూ కు షూటింగ్ లో ప్రమాదం.. ఒకేరోజు ముగ్గురికి?
ఒకేరోజు ముగ్గురు చిత్ర పరిశ్రమకు చెందిన వారు ప్రమాదానికి గురయ్యారు.
ఒకేరోజు ముగ్గురు చిత్ర పరిశ్రమకు చెందిన వారు ప్రమాదానికి గురయ్యారు. బాలివుడ్ నటి టబు, శిల్పా శెట్టి కి షూటింగ్ సమయంలో గాయాలయ్యాయి. అలాగే హీరో విశాల్ కు కూడా షూటింగ్ లోనే గాయాల పాలయ్యారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలివుడ్ నటి టబు భోలా సినిమాలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హీరో గా నటిస్తున్న ఈచిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ట్రక్కు అద్దాలు పగిలి...
అయితే హైదరాబాద్ లో ఛేజింగ్ సీన్ షూటింగ్ చేస్తుండగా ట్రక్కు అద్దాలు పగిలాయి. దీంతో టబు కంటికి, మొహం మీద గాయాలయ్యాయి. వెంటనే టబును ఆసుపత్రికి తరలించారు. కంటికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే వెబ్ సిరీస్ లో నటిస్తున్న శిల్పా శెట్టి గాయపడ్డారు. ఆమె కాలికి తీవ్ర గాయమయింది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇండియన్ పోలీస్ ఆఫీసర్ వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
విశాల్ కు గాయాలు...
ఇక హీరో విశాల్ కూడా షూటింగ్ చేస్తున్న సమయంలో గాయాలపాలయ్యారు. మార్క్ ఆంటోని సినిమా షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైట్ సీన్స్ చిత్రీకరించే సమయంలో విశాల్ గాయపడ్డారు. వెంటనే షూటింగ్ ను నిలిపేశారు. ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం విశాల్ తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒకేరోజు సినిమా షూటింగ్ లలో ముగ్గురు సెలబ్రటీలు గాయాల పాలవ్వడం చిత్ర పరిశ్రమలో టెన్షన్ మొదలయింది. అయితే ముగ్గురికీ తీవ్ర ప్రమాదం కాకపోవడం ఊరటనిచ్చే అంశమని చెప్పాలి.
Next Story