Mon Dec 23 2024 11:18:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసలేం జరిగింది ?
ఆర్ఆర్ఆర్ పై ఓ వివాదం తెరపైకొచ్చింది. ఈ సినిమాపై హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రంలో
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. అంతా బాగుంటే.. ఈ సమయానికే ఈ సినిమా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించేది. కానీ.. ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. ఏపీలో టికెట్ ధరల వ్యవహారమే అందుకు ప్రధాన కారణమన్న విషయం అందరికీ తెలిసిందే.
Also Read : ఇకపై అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
అసలే సినిమా విడుదల వాయిదా పడిందన్న బాధలో ఉన్న అభిమానులు. ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ పై ఓ వివాదం తెరపైకొచ్చింది. ఈ సినిమాపై హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించగా, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. అయితే, అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణమన్న ఆయన.. కొమురం భీమ్ - అల్లూరి చరిత్రలో కలిసినట్లు ఎక్కడా లేదని, లేనివాటిని వక్రీకరించి ఎలా చూపిస్తారని ప్రశ్నించారు.
కాగా.. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కథపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఆ మధ్య బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై కనిపించిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమా కథ పూర్తిగా కల్పితమని చెప్పకనే చెప్పారు. అల్లూరి - కొమురం భీం కలిస్తే ఎలా ఉండేదన్న ఆలోచనతోనే ఈ సినిమా తీసినట్లు చెప్పుకొచ్చారు. మరి తాజాగా దాఖలైన ఈ పిటిషన్ పై జక్కన్న ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story