Tue Mar 11 2025 05:25:03 GMT+0000 (Coordinated Universal Time)
Ooru Peru Bhairavakona: ఓటీటీలోకి వచ్చేసిన ఊరు పేరు భైరవకోన
తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ “ఊరు పేరు భైరవకోన” OTT ప్లాట్‌ఫారమ్ లోకి వచ్చేసింది

Ooru Peru Bhairavakona:తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ “ఊరు పేరు భైరవకోన” OTT ప్లాట్‌ఫారమ్ లోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఊహించిన డేట్ కంటే ముందే వచ్చింది. ఈ సినిమాను మార్చి మూడవ వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మొదట భావించారు. అయితే ఈ సినిమా మార్చి 8 నుండి అందుబాటులోకి వచ్చేసింది. ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే “ఊరు పేరు భైరవకోన” బాక్సాఫీస్ వద్ద డీసెంట్‌గా ఆడింది.
టైగర్ తర్వాత సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈమూవీ ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకుని.. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఊరు పేరు భైరవకోన సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ సినిమాను నిర్మించింది. ఇది ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలను మిళితం చేసిన సినిమా. ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. థియేట్రికల్ రన్ పూర్తీ అయిన 22 రోజుల తర్వాత, “ఊరు పేరు భైరవకోన” ఇప్పుడు స్ట్రీమ్‌కి అందుబాటులో ఉంది. సినిమా హాళ్లలో మిస్ అయిన వారికి ఈ సినిమా ఓటీటీలో ఈ శివరాత్రి హాలిడేస్ లో మంచి ఛాయిస్.
Next Story