Mon Dec 23 2024 11:56:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆరెంజ్ రీ-రిలీజ్ అరుదైన రికార్డు
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ సాధించడంతో.. ఈ పుట్టినరోజు చరణ్ కు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన నటించిన ఆరెంజ్ సినిమాను మార్చి 26న రీ రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ సాధించడంతో.. ఈ పుట్టినరోజు చరణ్ కు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు అభిమానులు కూడా చెర్రీ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్లలో రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమాను చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు.
ఆరెంజ్ స్పెషల్ షో లు వేసిన ప్రతీ థియేటర్లోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి 12 షోలకు పూర్తిగా హౌజ్ఫుల్ అయ్యి ఫస్ట్ ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు.. రీ రిలీజైన సినిమాల్లో.. మూడు రోజుల్లో 30 లక్షల మేర వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఆరెంజ్ లాంటి సినిమాకు ఈ స్థాయిలో అభిమానుల నుంచి రెస్పాన్స్ రావడం సంతోషించదగిన విషయమే.
Next Story