Sun Dec 22 2024 06:58:17 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకున్న "ఓరి దేవుడా"
బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ విశ్వక్సేన్ కు జంటగా నటించగా.. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా కనిపించారు.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రబృందం సక్సెస్ మీట్ ను జరుపుకుంది. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ విశ్వక్సేన్ కు జంటగా నటించగా.. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా కనిపించారు. విడుదలై రెండ్రోజులైనా కాకముందే "ఓరి దేవుడా" ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకున్నట్లు సమాచారం.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆహానుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆశాభట్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన "ఓరి దేవుడా" సినిమాను పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ఇటీవలే విశ్వక్సేన్, డీజే టిల్లు హీరో సిద్ధు అన్ స్టాపబుల్ -2 లో బాలయ్యతో కలిసి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు.
Next Story