Sat Dec 21 2024 14:50:13 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ అండ్ ఎమోషన్ టచ్.. "ఓరి దేవుడా" ట్రైలర్ రిలీజ్
ప్రేమ .. అలకలు .. గొడవలు .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
విష్వక్సేన్ హీరోగా.. లవ్ అండ్ ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగే కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా "ఓరి దేవుడా". పీవీపీ సినిమా వారు ఈ సినిమాను నిర్మించగా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. విష్వక్ కు జోడీగా మిథిల (కొత్త పరిచయం) నటించింది. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా "ఓరి దేవుడా" ట్రైలర్ రిలీజ్ అయింది.
ప్రేమ .. అలకలు .. గొడవలు .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్లో వెంకీమామ పాత్రను హైలెట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈనెల 21వ తేదీన సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కాగా.. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మురళీశర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Next Story