Mon Dec 23 2024 07:37:51 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ ఫిల్మ్ ఫెస్టివల్ - RRR, బీస్ట్ స్ట్రీమింగ్ తేదీలివే..కేజీఆఫ్ 2, ఆచార్య కూడా..
రాజమౌళి దర్శకత్వంలో తారక్ - చరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిప్పు - నీరుగా
హైదరాబాద్ : ఈనెల ఓటీటీల్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు.. మే నెలలోనే వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులకు పండగే. ముఖ్యంగా RRR ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. RRR సినిమా కోసం నిరీక్షిస్తున్న వారికి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. RRRతో పాటు బీస్ట్ కూడా ఓటీటీలో విడుదల కానుంది. అలాగే కేజీఎఫ్ 2, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆచార్య సినిమాలు కూడా ఈ నెలాఖరులోగా ఓటీటీల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో తారక్ - చరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిప్పు - నీరుగా కనిపించిన ఈ ఇద్దరు హీరోల నటనను తెరపై చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదంటూ అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ హైలెట్ గా నిలిచింది. అలాగే కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు, తారక్ - చరణ్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్లు ప్రేక్షకులచేత కంటతడి పెట్టించాయి. క్లైమాక్స్ ఫైట్ ను ఎవరూ ఊహించని రీతిలో చూపించారు రాజమౌళి. అలాంటి విజువల్ వండర్.. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం నిజంగా సౌత్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం.
మొత్తంమీద RRR లాంగ్ రన్ లో రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా 50 డేస్ ఫంక్షన్ చేసేందుకు ఇంకా కొన్ని థియేటర్లలో సినిమాను నడిపిస్తున్నారు. ఇక RRR సినిమా.. తెలుగుతో పాటూ సౌత్ వెర్షన్ష్ జీ5లో, హిందీ డబ్బింగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. యశ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 కూడా నాలుగు భాషల్లో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ సినిమాగా కేజీఎఫ్ 2 రికార్డు సృష్టించింది. రాకింగ్ స్టార్ అభిమానుల్ని మరింత ఉర్రూతలూగించేదుకు కేజీఎఫ్ చాప్టర్ 2ను మే 27న ప్రైమ్ లో విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక విజయ్ నటించిన బీస్ట్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజైనా.. వసూళ్లు మాత్రం తమిళ భాషకే పరిమితమయ్యాయి. కథలో కొత్తదనం లేకపోవడం.. కేజీఎఫ్ 2 విడుదల సమయంలోనే బీస్ట్ కూడా రావడం సినిమా వసూళ్లపై దెబ్బపడింది. థియేటర్స్ రన్ కంప్లీట్ చేసుకున్న బీస్ట్ సినిమా.. అన్ని భాష ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి నెట్ ఫ్లిక్స్ తో పాటు సన్ నెక్స్ట్ లోనూ బీస్ట్ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఏప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఆచార్య సినిమా కూడా ఈనెలలోనే ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనున్నట్లు సమాచారం. వీకెండ్ లోనూ కనీస వసూళ్లు రాకపోవడంతో.. నాలుగు రోజులకే థియేటర్ల నుంచి ఆచార్య అవుటయ్యాడు. తాజా సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య త్వరలోనే స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నాలుగు పెద్ద సినిమాలు.. ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి.
Next Story