Mon Dec 23 2024 10:51:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ రివ్యూ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్ !
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. అయితే సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. సెన్సార్ రివ్యూ మాత్రం
ఆర్ఆర్ఆర్.. అభిమానుల్లో భారీస్థాయిలో ఊహలు పెంచేసి.. ఆఖరికి ఉసూరుమనిపించిన భారీబడ్జెట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. అంతా బాగుంటే.. ఈ సమయానికే సినిమా విడుదలై వారంరోజులయ్యేది. జనవరి 7వ తేదీన సినిమాను థియేటర్లలో చూసేద్దాం అనుకున్న అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ పెద్ద షాకే ఇచ్చింది.
కాగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. అయితే సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. సెన్సార్ రివ్యూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ రివ్యూపై ట్వీట్ చేశారు. సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిందని పేర్కొన్నారాయన. అలాగే రామ్ చరణ్ కూడా తన పరిధిలో అద్భుతంగా నటించాడని, ఇద్దరు హీరోలు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిపారు. దంగల్, బాహుబలి 2 రికార్డులను ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా తిరగరాస్తుందని చెప్పుకొచ్చాడు. ఉమైర్ సంధు రివ్యూతో.. సినిమా చూడాలన్న ఆకాంక్ష అభిమానుల్లో మరింత పెరిగింది.
Next Story