Mon Dec 23 2024 07:39:53 GMT+0000 (Coordinated Universal Time)
సినిమాలో నటించబోతున్న సీమా
PUBG గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ ఆన్లైన్లో పరిచయమయ్యారు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు
పాకిస్థాన్ నుండి భారత్ కు నలుగురు పిల్లలతో కలిసి వచ్చేసిన సీమా హైదర్ ప్రస్తుతం దేశంలో పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన మహిళ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో అలాంటిదేమీ లేదని అంటున్నారు. సచిన్-సీమా లవ్ స్టోరీ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమె సినిమాల్లో కూడా నటించబోతోంది అంటున్నారు.
సినిమాలో ఒక పాత్ర కోసం ఆమెను ఆడిషన్ తీసుకున్నారు. జానీ ఫైర్ఫాక్స్ అనే బృందం గ్రేటర్ నోయిడాలో సీమను కలిసింది. 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' పేరుతో రాబోయే ప్రాజెక్ట్‌లో పాత్ర కోసం దర్శకులు జయంత్ సిన్హా సీమను ఆడిషన్ తీసుకున్నారు. ఈ చిత్రంలో సీమా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ఏజెంట్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. టైలర్ కన్హయ్య లాల్ గురించి వచ్చిన సినిమా అని అంటున్నారు. హిందూ మతాన్ని స్వీకరించినందుకు సీమను చిత్ర నిర్మాత అమీ జానీ సత్కరించారు. సీమా హైదర్ తో పాటూ ప్రొడక్షన్ హౌస్ కూడా ఆమె గురించి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎలాంటి నివేదిక ఇస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇటీవలే ఆమెను, సచిన్ ను యూపీ ఏటీఎస్ ప్రశ్నించింది. పాకిస్థాన్ లోని కరాచీ నుంచి సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది. నేపాల్‌లో సచిన్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఈ జంట గ్రేటర్ నోయిడాలోని రబ్పురా గ్రామానికి మారారు. PUBG గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ ఆన్లైన్లో పరిచయమయ్యారు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.
Next Story