Sat Dec 21 2024 04:46:20 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్-3 సక్సెస్ పై పాకిస్తానీ నటి వైరల్ ట్వీట్.. నెటిజెన్స్ రియాక్షన్!
చంద్రయాన్-3 సక్సెస్ పై పాకిస్తానీ యాక్ట్రెస్ సెహర్ షిన్వారీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై ఇండియన్ నెటిజెన్స్..
ఇటీవల చంద్రుడి పైకి రష్యా ప్రయోగించిన Luna 25 విఫలవడంతో ప్రపంచం దృష్టి మొత్తం చంద్రయాన్-3 (Chandrayaan 3) పై పడింది. దీంతో నిన్న ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ లాంచింగ్ ఘట్టాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా వీక్షించాయి. భారత్ శాస్త్రవేత్తల కృషి చంద్రయాన్-3 సేఫ్ లాండింగ్ అయ్యేలా చేసింది. చంద్రుడు పై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా నిలిచి భారతీయులను గర్వపడేలా చేసింది.
ఇక్కడ మరో గర్వించదగ్గ విషయం ఏంటంటే.. చంద్రుడి సౌత్ పోల్ వద్ద ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ అవతరించి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల సాధించిన ఘనతను ప్రశంసించకుండా ఉండలేకపోతుంది. ఈక్రమంలోనే మన పొరుగుదేశం పాకిస్తాన్ పౌరులు నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలు వైరల్ ట్వీట్స్ తో లైం లైన్ లో నిలిచే పాకిస్తానీ యాక్ట్రెస్ సెహర్ షిన్వారీ (Sehar Shinwari).. చంద్రయాన్-3 పై వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
ఆ ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది.. "ఇండియాతో ఉన్న శత్రుత్వం పక్కనపెడితే, చంద్రయాన్-3 విషయంలో ISRO సాధించిన దానిని తప్పకుండా అభినందించాల్సిందే. భారత్ సాధించిన ఘనతని అందుకోవడానికి పాకిస్తాన్ కు దాదాపు 2-3 దశాబ్దాలు పడుతుంది. నిజానికి ఈ దుస్థితి కారణం మనమే" అంటూ సొంత దేశాన్ని నిందిస్తూ, భారత్ ని పొగిడేస్తూ ట్వీట్ చేసింది.
ఇక ఈ ట్వీట్ చూసిన ఇండియన్ నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈక్రమంలోనే ఒక నెటిజెన్.. "పాకిస్తాన్ తో ఇండియాకి ఎప్పుడు శత్రుత్వం లేదు. భారత్ ఎప్పుడు పాకిస్తాన్ ని పోగుట్టుకున్న బ్రదర్ లాగానే చూస్తుంది" అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజెన్.. "మీరు కాశ్మీర్ మీద పెట్టిన దృష్టి, మీ డెవలప్మెంట్ మీద పెట్టి ఉంటే.. పాకిస్తాన్ కూడా ఈపాటికి ఎన్నో ఘనతలు సాధించేది" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
Sehar Shinwari
Next Story