Thu Jan 16 2025 19:38:36 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ కు వచ్చిన హాలీవుడ్ నటి
ప్రముఖ హాలీవుడ్ నటి పారిస్ హిల్టన్ భారత్ కు వచ్చింది. అక్టోబర్ 19, బుధవారం నాడు ఆమె ముంబైకి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తులతో ఆమె విమానాశ్రయం నుండి బయటకు వచ్చింది. నటి వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పారిస్ హిల్టన్ భారతదేశానికి రావడం ఇది నాలుగోసారి. ఈసారి ఆమె తన కొత్త వెంచర్ను ప్రారంభించడానికి వచ్చింది. హిల్టన్ అభిమానులు ముంబై విమానాశ్రయంలో ఆమెకు పూల బొకేలతో స్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. ప్యారిస్ హిల్టన్ తన అభిమానులతో మాట్లాడడమే కాకుండా.. ఫోటోగ్రాఫర్ల కోసం పోజులివ్వడం చూడవచ్చు. ఆమె హిల్టన్ హోటల్స్ యాజమాన్యంలో ఒకరనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె భారత్ లో తన పెర్ఫ్యూమ్ లాంచ్ కోసం వచ్చిందని కూడా అంటున్నారు.
బాలీవుడ్ చిత్రాల గురించి ఆమె మాట్లాడుతూ, "బాలీవుడ్ సరదాగా అనిపిస్తుంది. నాకు రెండు బాలీవుడ్ చిత్రాల నుండి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్లో పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు కానీ స్క్రిప్ట్లు నాకు ఆసక్తిగా ఉంటే మాత్రమే నటించగలను. నేను ఈసారి చిన్న వ్యాపార పర్యటనలో ఉన్నాను కాబట్టి నేను ఎలాంటి చాట్ షోలు చేయను." అని చెప్పుకొచ్చింది. పారిస్ హిల్టన్ ప్రస్తుతం తన పాప్ ఆల్బమ్ కోసం బిజీ బిజీగా గడుపుతోంది. ఒక పుస్తకం రాయడమే కాకుండా.. సొంత బోటిక్ హోటళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇక ముంబైలో అడుగుపెట్టినప్పుడు ప్యారిస్ హిల్టన్ చేతిలో ఫ్యాన్ ను కూడా మనం చూడవచ్చు.
Next Story