Fri Dec 20 2024 14:30:33 GMT+0000 (Coordinated Universal Time)
హైపర్ ఆదిపై పావలా శ్యామల ఆగ్రహం..
జబర్దస్త్ షోలో ఒక స్కిట్ లో హైపర్ ఆది.. తను చనిపోయినట్లు చూపించారంటూ పావలా శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు వెండితెర పై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన కొంతమంది.. ఇప్పుడు దీనస్థితిలో కాలం సాగిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడుతూ, తినడానికి కూడా సంపాదన లేక ఇబ్బందులు పడుతూ.. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వీరి బాధని నలుగురికి తెలియజేయడానికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే పలువురు కళాకారులు సహాయం అందుకుంటూ వస్తున్నారు.
ఇక కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇలా మంచి కోసం పని చేస్తుంటే.. కొన్ని ఛానల్స్ మాత్రం బ్రతుకున్న కళాకారుడినే చంపేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఈ న్యూస్ బాధలో ఉన్న ఆ కళాకారులని, వారి కుటుంబాలను మరింత బాధకి గురి చేస్తుంది. ఇలాంటి బాధనే టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల కూడా ఎదుర్కొన్నారు. సినిమా ఆఫర్లు తగ్గడం, సంపాదన లేకపోవడం, అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లికూతురు.. ఇది పావలా శ్యామల పరిస్థితి.
సినిమాల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న పావలా శ్యామలకి ఒక కూతురు ఉంది. కుమార్తె పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోయారు. ప్రస్తుతం శ్యామల గుండె, కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. ఇక ఆమె కూతురు టీబీ భారిన పడి, కాలుకి ఆపరేషన్ అవ్వడంతో ప్రస్తుతం వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. ఈ సమస్యలతో బాధ పడుతున్న తనని జబర్దస్త్ షోలో చేసే హైపర్ ఆది తనని ఇంకా బాధ పెట్టాడని.. శ్యామల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"జబర్దస్త్ షోలో ఒక స్కిట్ లో హైపర్ ఆది.. చనిపోయిన నటీనటుల పక్కన తన ఫోటో పెట్టి శ్యామల కూడా చనిపోయింది అనే భావన చూసి ప్రేక్షకుల్లో కలిగించాడు. తన దగ్గరికి వెళ్లి గట్టిగా ప్రశ్నించాలని ఉంటుంది. కానీ నా దగ్గర అంత శక్తి లేదు. అతడు మాత్రమే కాదు చాలామంది అదే పని చేస్తున్నారు. చనిపోయినట్లు మీకు ఎవరు చెప్పారని ఒకర్ని ప్రశ్నిస్తే.. వాళ్ళు మరొకరి పేరు చెబుతారు. నేను మాత్రం ఎంతమందిని మాత్రం ప్రశ్నించగలను" అంటూ బాధపడ్డారు.
Next Story