Mon Dec 23 2024 13:38:29 GMT+0000 (Coordinated Universal Time)
ముదురుతున్న వివాదం.. నరేష్, పవిత్ర లోకేష్ ఏమి చెబుతున్నారంటే..?
తాజాగా ఈ వివాదంపై పవిత్ర లోకేష్ వీడియోను విడుదల చేశారు. రమ్య తమని అనవసరంగా బ్యాడ్ చేస్తోందని పవిత్ర లోకేష్ తెలిపింది. నరేశ్ గారు ఎవరు, ఆయన ఫ్యామిలీ ఏంటి అనేది అందరికి తెలుసు.
నటి పవిత్ర లోకేష్, నరేష్ ల గురించి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ లో ఉందని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. నరేష్ కి తన మూడో భార్య రమ్యతో విభేదాలు కొనసాగుతూ ఉండడంతో.. అతడు పవిత్రని వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇక రమ్య బెంగుళూరులో కన్నడ మీడియా ముందు చాలా విషయాలను చెప్పింది. వెళ్లి అక్కడ మీడియాలో నరేశ్ తన భర్త అని పవిత్ర లోకేష్ తమ బంధానికి అడ్డుగా మారింది అంటూ విమర్శలు కురిపించింది. ఈ విమర్శలపై నరేష్ స్పందిస్తూ రమ్య ఆరోపణలని ఖండించారు.
తాజాగా ఈ వివాదంపై పవిత్ర లోకేష్ వీడియోను విడుదల చేశారు. రమ్య తమని అనవసరంగా బ్యాడ్ చేస్తోందని పవిత్ర లోకేష్ తెలిపింది. నరేశ్ గారు ఎవరు, ఆయన ఫ్యామిలీ ఏంటి అనేది అందరికి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తమ రిలేషన్ పై దాటవేసింది. కానీ రమ్య ఇక్కడ బెంగుళూరుకి వచ్చి మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. నేను వాళ్ళిద్దరి బంధానికి అడ్డుగా ఉన్నానని.. నేను నరేష్ ,పెళ్లి చేసుకున్నాం అని మీడియాకు చెప్పింది. ఆమె చేసిన ఆరోపణలు నా మనసుకి బాధ కలిగించాయని తెలిపింది. రమ్య గారు ఆమెకి భర్త కావాలని ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే మాట్లాడాలి. ఇది ఫ్యామిలీ మ్యాటర్. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. ఇక్కడ కర్ణాటకు వచ్చి ఆమె ఎందుకు మాట్లాడుతోంది. ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముందు తేల్చుకోవాలి అని పవిత్ర లోకేష్ సూచించారు. నరేశ్ భార్యనంటూ వచ్చిన రమ్య బెంగళూరులో మీడియాలో తనపై చాలా చెడుగా మాట్లాడిందని వెల్లడించారు. వాళ్ల కాపురంలో తాను చిచ్చుపెడుతున్నానంటూ లేనిపోని అభాండాలు వేసిందని పవిత్ర లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని తెలిపారు. నాకున్న సమస్య గురించి చెప్పాలనే ఈ వీడియో చేశానని పవిత్ర లోకేష్ అన్నారు.
Next Story