Mon Dec 23 2024 14:55:37 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ - రేణు దేశాయ్ లను ఒకవేదికపైకి తీసుకొచ్చిన అకిరా
రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అకిరా నందన్ గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్..
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ లు విడిపోయి చాలాకాలమైంది. నాటి నుంచి నేటి వరకూ వారిద్దరి సంతానమైన అకిరా నందన్, ఆద్య లు రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అకిరా నందన్ గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ తండ్రి హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్, రేణు దేశాయ్, అకిరా నందన్, ఆద్య లు కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫొటోను రేణు దేశాయ్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేయగా.. అభిమానులంతా.. అన్నా - వదినలను మళ్లీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ లు కలిసి బద్రి సినిమాలో నటించారు. అప్పుడే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్యశ్రీ సంతానం ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత పవన్ - రేణు లు కలవడం ఇదే మొదటిసారి. కానీ.. మెగాస్టార్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అకిరా, ఆద్య లు ఖచ్చితంగా హాజరవుతారు. ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. వాటికి బలం చేకూరుస్తూ.. రేణు కూడా ఒకట్రెండు ఫొటోలు షేర్ చేశారు. కానీ.. ఎందుకో ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.
విడాకుల తర్వాత పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నా.. రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఎవరి కెరియర్ లో వారు బిజీ అయిపోయారు. పవన్ కల్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరో పక్క పార్టీ పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Next Story