Mon Dec 23 2024 14:52:20 GMT+0000 (Coordinated Universal Time)
‘బ్రో’ టీజర్.. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జులై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. మరీ ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్లో సినిమా అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మామ-అల్లుడు కలిసి.. చేస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. తమిళంలో వచ్చిన వినోదయ సిత్తంకు ఇది రీమేక్. ఆ సినిమాను తీసిన సముద్రఖనే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జులై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 29 రోజుల సమయమే ఉండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే పవన్ అండ్ తేజ్ ల పోస్టర్లను విడుదల చేశారు.
తాజాగా.. గురువారం సాయంత్రం ‘బ్రో’ టీజర్ ను విడుదల చేశారు. టీజర్లో మామ-అల్లుడు అదరగొట్టేశారు. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరైనా ఉన్నారా..హలో మాస్టారూ.. గురువుగారూ.. తమ్ముడూ.. అన్న కనిపించని పవన్ కల్యాణ్.. బ్రో అనగానే ఎంట్రీ ఇస్తాడు. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’, సినిమాలెక్కువ చూస్తావేంట్రా నువ్వు అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. టీజర్ కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుండగా.. ఖజరారే ఖజరారే పాట తరహాలో ఈ పాట ఉంటుందని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘బ్రో’ జులై 28న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
Next Story