Mon Dec 23 2024 15:07:25 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ మూవీ టైటిల్ "బ్రో"
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తొలిసారి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా "బ్రో". ఈ చిత్రం టైటిల్ ను చిత్రయూనిట్ నేడు ప్రకటించింది. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా పంచుకుంది. ఈ పోస్టర్ లో పవన్ లుక్ తో పాటు తమన్ సంగీతం హైలెట్ గా నిలిచింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తొలిసారి మామ - అల్లుడు కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సితమ్ కు రీమేక్ గా బ్రో రూపొందుతోంది. తెలుగు ఆడియన్స్ అభిరుచికి, పవన్ మేనరిజంకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Next Story