Sun Dec 22 2024 17:22:57 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ టీమ్ కు పవన్, త్రివిక్రమ్ గ్రాండ్ పార్టీ
ఈ పార్టీకి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా..
హైదరాబాద్ : భీమ్లా నాయక్.. విడుదలైన మూడోరోజు కూడా కాసుల వర్షం కురిపిస్తోందీ చిత్రం. ఈ సినిమా పవన్ కల్యాణ్ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని సినీ విమర్శకులు సైతం చెప్తుండటం విశేషం. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో.. హీరో పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లు భీమ్లా నాయక్ టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీకి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా భీమ్లా నాయక్ సినిమాకు పనిచేసిన వారంతా ఈ పార్టీలో దర్శనమిచ్చారు. పవన్ కు బాణసంచాతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు త్రివిక్రమ్. కాగా.. భీమ్లా నాయక్ విడుదలైన ఫస్ట్ డే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు రూ.50-55 కోట్ల వరకూ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. సినిమా థియేట్రికల్ రన్ లో రూ.120 కోట్ల వరకూ వసూళ్లు రావొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
Next Story