Mon Dec 23 2024 12:23:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ ?
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. వరుస టీజర్లు, పాటలతో మెగా అభిమానులకు
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ నిర్మించిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. వరుస టీజర్లు, పాటలతో మెగా అభిమానులకు మరింత అంచనాలు పెంచగా.. ప్రస్తుతం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ పెంచేందుకు సిద్ధమైంది.
ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుండగా.. ఈవెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ విడుదల కావచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్టులుగా రానున్నారని టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story