Mon Dec 23 2024 07:04:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రో ట్రైలర్ వచ్చేస్తోంది
పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో' సినిమా జూలై 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ ను
పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో' సినిమా జూలై 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తుంది. 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ఉండనుంది. పవన్ కళ్యాణ్ స్పెషన్ అప్పియరెన్స్ తో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. కీలక అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. జూలై 21న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వివేక్ కూచిబొట్ల వెల్లడించాడు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ.. ఎప్పుడు అనే విషయమై సస్పెన్స్ నడుస్తూ ఉంది. జూలై 24న అనుకున్నారు కానీ.. పవన్ బిజీగా ఉండటంతో ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. నైజామ్ హక్కులను ముప్పై రెండు కోట్లకు అమ్మారని ప్రచారం జరుగుతూ ఉంది.
Next Story