Mon Dec 23 2024 11:48:31 GMT+0000 (Coordinated Universal Time)
రేణు దేశాయ్ సంచలన వీడియో.. పవన్ కళ్యాణ్ పై
తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఓ తల్లిగా నేను
ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే సమయంలో మూడు పెళ్లిళ్లు అంటూ ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్నారు వైసీపీ నాయకులు. బ్రో సినిమా వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తామని అన్నారు.
తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఓ తల్లిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. పిల్లలను దయచేసి ఇందులోకి లాగకండని కోరారు. మీరు మీరు ఏదైనా ఉంటే చూసుకోండి కానీ.. దయచేసి మా పిల్లలను రాజకీయాల్లోకి లాగకండి అని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోండి కానీ పిల్లల విషయాన్ని లాగకండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఆయన నా విషయంలో చేసింది ముమ్మాటికీ తప్పే.. అయితే పిల్లలను రాజకీయాల్లోకి లాగకండని అన్నారు. ఆయన ప్రజలకు సేవ చేయాలని అనుకునే వ్యక్తి అని.. ఆ విషయంలో తన సపోర్ట్ మాత్రం ఎప్పుడూ ఉంటుందని రేణు దేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. ఒక సిటిజన్ గా మాత్రం తాను పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటానని చెప్పుకొచ్చారు. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండన్నారు. తన మాజీ భర్త, తనకు సంబంధించిన అంశాలతో సినిమా, ఓటీటీ సీరిస్‌లు తీస్తామంటున్నారని అది కరెక్ట్ కాదన్నారు. తన పిల్లలే కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను లాగడం మంచిది కాదని సూచించారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదన్నారు.
Next Story