Sun Dec 22 2024 16:07:33 GMT+0000 (Coordinated Universal Time)
వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు.. బాధతో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్..
వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు చూసి బాధతో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతున్న ఈ పెళ్లి వేడుక సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడిగా సాగనుంది. మొన్న నైట్ సంగీత్ పార్టీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక నిన్న హల్దీ, మెహందీ వేడుకకు సంబంధించిన పిక్స్ కూడా వచ్చాయి.
ఆ ఫొటోల్లో వరుణ్, లావణ్య, నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు, హీరో నితిన్ దంపతులు కనిపిస్తున్నారు. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ విచారం ఎందుకు కోసం..?
ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా లెజనోవాతో కలిసి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్కడి నుంచి మెగా ఫ్యామిలీలోని హీరోలందరి ఫోటోలు వస్తున్నాయి గాని పవన్ పిక్స్ మాత్రం రావడం లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్.. 'కొంచెం మా హీరో ఫోటోలు కూడా ఎవరో ఒకరు లీక్ చేయండయ్యా' అంటూ బాధతో పోస్టులు చేస్తూనే నెటిజెన్స్ నవ్విస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఈరోజు మధ్యాహ్నం పెళ్లి పూర్తి అయిన తరువాత.. రాత్రికి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారు. అది పూర్తి చేసుకున్న తరువాత హైదరాబాద్ వచ్చి నవంబర్ 5న రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీ పర్సన్స్ కోసం మరో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Next Story