Mon Dec 23 2024 11:12:53 GMT+0000 (Coordinated Universal Time)
హరిహర వీరమల్లు షూటింగ్ని పవన్ అందుకే ఆలస్యం చేస్తున్నాడా..?
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ని ఆలస్యం చేస్తూ రావడానికి పెద్ద కారణమే ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారియర్ గా నటిస్తున్న మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా సెట్స్ పైనే ఉంది. పవన్ ఈ సినిమా తరువాత స్టార్ట్ చేసిన సినిమాలు అన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప, వీరమల్లు సంగతి మాత్రం అసలు చూడడం లేదు. ఈక్రమంలో కొందరు పవన్ అభిమానులు అయితే ఈ సినిమా ఉందన్న విషయం కూడా మర్చిపోయారు.
అయితే పవన్ ఈ సినిమాని ఆలస్యం చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఈ మూవీని AM రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్మాత కుమారుడు జ్యోతి కృష్ణ ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయనను హరిహరవీరమల్లు కథ ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు.
దానికి బదులిస్తూ.. "తమ బ్యానర్ నుంచి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్, కర్తవ్యం చిత్రాలు లాగానే వీరమల్లు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మూవీ ఇండియా కల్చర్ ని అందరికి తెలియజేసేలా ఉంటుంది" అంటూ వెల్లడించాడు. ఇక ఈ అంశం వలనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఆలస్యం చేస్తూ వస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాని ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేస్తామంటూ.. నిర్మాత ఏ ఎం రత్నం ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నాడు. అయితే ఇదంతా పవన్ ఐడియా అని ఇప్పుడు అర్ధమవుతుంది. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఎన్నికల ముందు విడుదల చేస్తే.. రాజకీయంగా తనకి కూడా హెల్ప్ అవుతుందని పవన్ భావిస్తున్నట్లు ఉంది. కాగా ఈ మూవీ ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎండింగ్ కి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ ని కంప్లీట్ చేస్తామంటూ నిర్మాత చెబుతున్నాడు. మరి ఈ మూవీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.
Next Story