Sun Dec 22 2024 13:55:15 GMT+0000 (Coordinated Universal Time)
నాన్ స్టాప్ ఉస్తాద్ భగత్ సింగ్..
ఇటీవలే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో బ్రేక్ వేసుకుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ బ్లాస్టింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఇక ఆ చిత్రంలో కూడా పవన్ పోలీస్ పాత్రలోనే కనిపిస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. ఆ మధ్య ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.
ఆ తరువాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఇటీవలే సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేశాడు. అయితే ఆ షెడ్యూల్ ఇలా మొదలైందో లేదో.. వెంటనే బ్రేక్ లు పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ వలన పవన్ కళ్యాణ్ మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఉస్తాద్ మళ్ళీ ఇబ్బందుల్లో పడినట్లు అయ్యింది.
ఇక షూటింగ్ కి బ్రేక్ పడడంతో అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు. అయితే ఆ బ్రేక్ జస్ట్ ఇంటర్వెల్ బ్రేక్ లాంటిది మాత్రమే అని తెలుస్తుంది. మూవీ షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది అంటూ హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేశాడు. పవన్ తో పవర్ ప్యాకెడ్ షెడ్యూల్ కంటిన్యూగా జరుగుతున్నట్లు సెట్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో పవన్ పోలీస్ డ్రెస్ లో గబ్బర్ సింగ్ డేస్ ని గుర్తు తెస్తున్నాడు.
కాగా ఈ లాంగ్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్, అలాగే పోలీస్ స్టేషన్ సన్నివేశాలు పూర్తి చేయనున్నారని సమాచారం. ఈ మూవీలో పవన్ కి జోడిగా శ్రీలీల (Sreeleela), సాక్షి వైద్య (Sakshi Vaidya) నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story