Mon Dec 23 2024 12:57:33 GMT+0000 (Coordinated Universal Time)
నెక్ట్స్ అన్ స్టాపబుల్ 2కి వచ్చేది పవర్ స్టారేనా ? హింట్ ఇచ్చిన "ఆహా"
ఇక.. తర్వాతి ఎపిసోడ్ గెస్ట్ ఎవరో మీరే గెస్ చేయండంటూ.. ఓ హింట్ వదిలింది ఆహా టీమ్. ఆ హింట్ ఏంటంటే..
నందమూరి నటసింహం.. బాలకృష్ణ హోస్ట్ గా జరుగుతున్న షో అన్ స్టాపబుల్ 2. మొదటి సీజన్ కంటే.. రెండో సీజన్ టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా పెద్ద డైరెక్టర్లు, నిర్మాతల నుండి, రాజకీయ నేతలు, యువ హీరోలు ఇలా అందరినీ వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ దూసుకుపోతోంది అన్ స్టాపబుల్ 2. తాజాగా ఈ షోకి ప్రభాస్,గోపీచంద్ గెస్టులుగా వచ్చారు. వాళ్లిద్దరికీ సంబంధించిన రెండు గ్లింప్స్ ను వదిలింది ఆహా. త్వరలోనే ప్రోమో వదులుతామని చెప్పింది.
ఇక.. తర్వాతి ఎపిసోడ్ గెస్ట్ ఎవరో మీరే గెస్ చేయండంటూ.. ఓ హింట్ వదిలింది ఆహా టీమ్. ఆ హింట్ ఏంటంటే.. విశ్వక్సేన్, సిద్దు వచ్చిన ఎపిసోడ్ లో బాలకృష్ణ త్రివిక్రమ్ తో ఫోన్లో మాట్లాడుతూ.. మీరు వచ్చేటపుడు ఎవరిని తీసుకురావాలో తెలుసుగా అన్న వీడియోను ట్వీట్ చేసింది. దానిని బట్టి.. నెక్ట్స్ వచ్చేసి పవన్ కల్యాణేనంటున్నారు నెటిజన్లు, పవన్ అభిమానులు. మరోవైపు ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ఓ ట్వీట్ కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.
'డిసెంబర్ 27న వచ్చే బ్లాక్ బస్టర్ అప్డేట్ కోసం రెడీగా ఉండండి' అంటూ ఆహాని ట్యాగ్ చేయడంతో ఆ వచ్చేది పవన్ కల్యాణే అంటున్నారు. డిసెంబర్ 27న పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన ఏదొక అప్డేట్ వస్తుందా ? లేక మరో సర్పైజ్ ఏమన్నా ఉందా ? అన్నది క్లారిటీ లేదు కానీ.. ఇంతవరకూ ఏ టాక్ షో అటెండ్ అవని, ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వని పవన్ కల్యాణ్.. బాలయ్య టాక్ షోకి వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్ నిజ జీవితం, సినిమా కెరీర్, రాజకీయాల గురించి బాలయ్య ప్రశ్నలు సంధిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Next Story