Thu Dec 19 2024 14:45:28 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. తోపులాటలో కొడాలి నాని..
మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహానికి హాజరయిన పవన్ కళ్యాణ్. తోపులాటలో కొడాలినాని ఇబ్బంది.

విజయవాడ దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహం.. కృష్ణా జిల్లా పోరంకిలో ఆదివారం (అక్టోబర్ 22) రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు రాజకీయనాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ పెళ్లికి వచ్చి రాధా-పుష్పవల్లి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ రావడంతో అక్కడ అభిమానులతో కొంచెం గందరగోళ పరిస్థితి క్రియేట్ అయ్యింది. పవన్ చూసేందుకు ఫ్యాన్స్ ముందుకు దూసుకు వచ్చారు. ఈక్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదురుకున్నారు. కొడాలి నాని, వంగవీటి రాధా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. ఇక నిన్న జరిగిన పెళ్లిలో కూడా కొడాలి నాని, రాధా దగ్గరలోనే ఉంటూ కనిపించారు. పవన్ వచ్చిన సమయంలో కొడాలి నాని.. పెళ్లి వేదిక దగ్గరిలో నిలుచొని ఉన్నారు.
పవన్ కళ్యాణ్ వేదిక దగ్గరకి వచ్చే సమయానికి.. చుట్టూ అభిమానులతో ఒక గందరగోళ తోపులాట జరిగింది. ఈక్రమంలో అక్కడే ఉన్న కొడాలి నాని కింద పడిపోయే పరిస్థితి జరిగింది. ఈ తోపులాటలోనే మరో రాజకీయనేత వల్లభనేని వంశీ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
కాగా వంగవీటి రాధా వివాహమాడిన వధువు నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి కుమార్తె. ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్.. కొంతసేపు జంటతో మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story