Mon Dec 23 2024 15:42:44 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్ లేడీ ఫ్యాన్ హంగామా.. కటౌట్ పైకి ఎక్కి..
పవన్ అభిమాని అయిన ఆ యువతి.. భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ పైకి..
హైదరాబాద్ : పవన్ కల్యాణ్.. ఆయనకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ సినిమా విడుదలవుతుందంటే చాలు మామూలు హంగామా చేయరు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, ఆ కటౌట్లకు పూలదండలు, బాణసంచా పేలుళ్లు, పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాల ఏర్పాటు ఇలా చాలా హడావిడి చేస్తుంటారు. ఇవన్నీ మేల్ ఫ్యాన్సే చేస్తారనుకుంటే పొరపాటే. వాళ్లకి మేమేం తక్కువ కాదన్నట్లుగా.. ఓ లేడీ ఫ్యాన్ పవన్ కల్యాణ్ కటౌట్ ఎక్కి.. పాలాభిషేకం చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : ఆ ఇద్దరు మంత్రులకూ పవన్ అభిమానుల సెగ
పవన్ అభిమాని అయిన ఆ యువతి.. భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ పైకి మెడలో ఎర్రటి గుడ్డను ధరించి ఎక్కింది. ఆ తర్వాత పాలాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకుంది. పవన్ కల్యాణ్ కు మహిళల్లోనూ అభిమానులున్నారు కానీ.. ఇలాంటి అభిమానిని ఎక్కడా చూడలేదంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్లు. ఇక కటౌట్ కి పాలాభిషేకంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. పవన్ అభిమానులు.. అది ఫాలోయింగ్ అంటే అని ఆ అమ్మాయిని పొగుడుతుంటే.. మరికొందరు అన్ని పాలను కటౌట్ పై పోసి నేలపాలు చేసేబదులు.. ఆకలితో ఉన్న వారికి ఇస్తే కడుపైనా నిండుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story