Mon Dec 23 2024 10:16:38 GMT+0000 (Coordinated Universal Time)
సురేందర్ రెడ్డితో సినిమా ఆగిపోలేదా..? పవన్ మూవీ అప్డేట్స్..!
కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డితో ఒక మూవీ అనౌన్స్ చేశాడు. ఆ మూవీతో పాటు పవన్ చిత్రాల అప్డేట్స్ మీకోసం..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీ ఎంట్రీ తరువాత.. తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డితో ఒక మూవీ అనౌన్స్ చేశాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడని, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తల్లూరి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రకటించి ఏళ్ళు గడిచినా దర్శకనిర్మాతల నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.
దీంతో ఈ మూవీ అటక ఎక్కిందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, రామ్ తల్లూరి కలిసి ఈ సినిమా కోసం ఒక కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేశారట. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకి వచ్చింది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఇక పవన్ కి ఉన్న ప్రస్తుత కమిట్మెంట్స్ కూడా పూర్తి అయ్యేపాటికి కొంత సమయం పడుతుంది. ఈక్రమంలోనే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ మూవీ పట్టాలు ఎక్కనుందని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా.. తాను నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే OG మూవీ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
ఇక పవన్ నటిస్తున్న పిరియాడికల్ మూవీ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ వారియర్ గా నటిస్తున్నాడు. ఇక గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా నుంచి కూడా అదిరిపోయే పోస్టర్ ని రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ అప్డేట్స్ అన్ని నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Next Story