Mon Dec 23 2024 09:53:37 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : OG షూటింగ్ ఆగిపోయింది.. నిర్మాత వైరల్ ట్వీట్..
OG మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూడకండి, సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ నిర్మాత చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రాజకీయ వ్యవహారాలు వల్ల ఈ చిత్రాలు షూటింగ్ ఎప్పుడు పూర్తి అయ్యి, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయో అన్నది మాత్రం తెలియడం లేదు. ఉస్తాద్ ఒక 10 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంటే, వీరమల్లు ఒక 50 శాతం చిత్రీకరణ చేసుకుంది. OG మాత్రం ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
పవన్ అభిమానుల్లో కూడా OG మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి అలాంటి కథలు కోరుకునే అభిమానులు.. పవన్ గ్యాంగ్ స్టార్ గా చూసి చాలా కాలం అయ్యింది. పంజా తరువాత మళ్ళీ పవన్ అలాంటి పవర్ ఫుల్ పాత్రని పోషించలేదు. దీంతో OGలో పవన్ అలాంటి ఒక పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్.. ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాకి వరుస డేట్స్ ఇస్తూ పవన్ కూడా ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసుకుంటే.. అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు OGతో పాటు మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్ కూడా పవన్ కంప్లీట్ బ్రేక్ ఇచ్చేశారు. ప్రస్తుతం పూర్తి పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టారు.
అయితే అభిమానులు మాత్రం OG మేకర్స్ ని మూవీ అప్డేట్స్ గురించి రోజు అడుగుతుండడంతో నిర్మాత బదులిచ్చారు. "ఫ్యాన్స్ ఆకలితో ఉండడం కామన్. కానీ మీకు తెలియవల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం మేము సినిమా షూటింగ్ జరపడం లేదు. కాబట్టి అప్డేట్స్ కోసం ఎదురు చూడకండి. వాటికీ కొంత సమయం పడుతుంది" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఏపీ ఎన్నికలు అయ్యేవరకు ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కదని తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు ఏ అప్డేట్ ఉండదని తెలుస్తుంది. ఇక ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ఎలక్షన్స్ ముందే రిలీజ్ అయ్యిపోతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయ్యేవరకు సినిమా షూటింగ్ కూడా జరగదని తెలిసి అభిమానులు ఫీల్ అవుతున్నారు.
Next Story